జాతీయ రహదారులు
చిత్తూరు - కడప - కర్నూలు జాతీయ రహదారి (గువ్వల చెరువు ఘాట్ )

కడప జిల్లాలోని జాతీయ రహదారులు

జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప మిగతావి కొంత గందరగోళంగా తయారయ్యాయనే చెప్పాలి. ఏదైనా ఒక జాతీయ రహదారిని తీసుకుని దానితో కలుస్తున్న లేదా దాన్నుంచి విడిపోయిన ఇతర జాతీయ రహదారుల నంబర్లేమిటని చూస్తే చాలా సందర్భాలలో అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండేవి. అందువల్ల గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమయ్యేది. దాంతో పదేండ్ల కిందట 2010లో రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారులకు నంబర్లు కేటాయించడానికి ఒక క్రమ పద్ధతిని ప్రవేశపెట్టింది.

ప్రధాన జాతీయ రహదారుల్లో ..

అడ్డంగా (తూర్పు-పడమరలుగా) పోయే జాతీయ రహదారులకు ఉత్తరాన మొదలుపెట్టి బేసి సంఖ్యలు (1, 3, 5, 7,…),

నిలువుగా(ఉత్తర దక్షిణాలుగా) పోయే జాతీయ రహదారులకు తూర్పున మొదలుపెట్టి సరి సంఖ్యలు (2, 4, 6, 8,…) ఇచ్చుకుంటూ పోయారు.

చదవండి :  కడపలో విశాలాంధ్ర పుస్తకాల అంగడి

ఇవి ప్రధానమైన జాతీయ రహదారులే కాబట్టి దేశమంతా కలిపి చూసినా వందకు లోపే ఉంటాయి. అంటే ఒకటి లేదా రెండంకెల సంఖ్యలే (1 నుంచి 99 వరకు) ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి నిలువుగా ఉన్నవి 35 ప్రధాన జాతీయ రహదారులు (70వ నంబరు వరకు), అడ్డంగా ఉన్నవి 44 ప్రధాన జాతీయ రహదారులు (87వ నంబరు వరకు) ఉన్నాయి.

ద్వితీయ ప్రాధాన్యత గల జాతీయ రహదారులు ప్రధాన జాతీయ రహదారుల్లో ఏదో ఒకదానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఒక్కో ప్రధాన జాతీయ రహదారికి ఇలా అనుసంధానమైన రహదారులు పది కంటే ఎక్కువ లేనట్లైతే ఆ కనెక్ట్ ఐన రహదారులకు ఉండే సింగిల్ డిజిట్ వరుస నంబరుకు (1 నుంచి గరిష్ఠంగా 9 వరకు) ఆ ప్రధాన జాతీయ రహదారి నంబర్ చేరి మొత్తం మూడంకెల సంఖ్య వస్తుంది. ఉదాహరణకు 2వ నంబరు జాతీయ రహదారి నుంచి మొదలయ్యే ద్వితీయ ప్రాధాన్యత గల జాతీయ రహదారులు 102, 202, 302, మొ. వీటిలో చివరి రెండంకెలు (02) ప్రధాన జాతీయ రహదారి నంబరు. ఈ మూడంకెల సంఖ్య ప్రధాన జాతీయ రహదారి నంబరుతో ఎందుకు మొదలవలేదో ఈ ఉదాహరణతో మీకు అర్థమై ఉండాలి.

చదవండి :  తాగే నీళ్ళ కోసం..ఖాళీ బిందెలతో ఆందోళన

ఒక్కో ప్రధాన జాతీయ రహదారికి ఇలా కనెక్ట్ ఐన రహదారులు పది కంటే ఎక్కువున్నా, లేక పై రెండు రకాల జాతీయ రహదారులకు పొడిగింపుగానో, అనుబంధంగానో మూడవ స్థాయి జాతీయ రహదారులున్నా వాటిని అనుబంధ జాతీయ రహదారులుగా పరిగణించి మూడంకెల సంఖ్యకు పక్కన A, B, C, D,… ఇలా చేరుస్తారు. ఉదా: 102A, 102B, 102C, మొదలైనవి.

కడప జిల్లాలో పై మూడు రకాల జాతీయ రహదారులూ ఉన్నాయి:

ప్రధాన జాతీయ రహదారులు :

NH-40 (సరిసంఖ్య: ఉత్తరం-దక్షిణం): కర్నూలు-కడప-చిత్తూరులను కలిపే ప్రధాన జాతీయ రహదారి (మైదుకూరు, చెన్నూరు, కడప, రాయచోటి, సంబేపల్లె మీదుగా. పాత నంబరు: NH-18).

చదవండి :  అన్నమయ్య కథ (మొదటి భాగం)

NH-67 (బేసిసంఖ్య: తూర్పు-పడమర): కృష్ణపట్నం-హుబ్లి (బద్వేలు, మైదుకూరు, ముద్దనూరు మీదుగా. కర్ణాటకలో హుబ్లి/ధార్వాడ్ దగ్గర ముంబైకి పోయే NH-48ని కలుస్తుంది).

ద్వితీయ ప్రాధాన్యత గల జాతీయ రహదారులు :

NH-340 : NH-40 నుంచి విడిపోయే మూడవ బ్రాంచి (NH-40 మీద ఉన్న రాయచోటి నుంచి బెంగళూరు రోడ్డులో మదనపల్లె దగ్గరున్న కురబలకోట వరకు ఉన్న జాతీయ రహదారి).

NH-716 : చెన్నై దగ్గర NH-16 నుంచి విడిపోయే ఏడవ బ్రాంచి (చెన్నై నుంచి శెట్టిగుంట, రైల్వే కోడూరు, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, మాధవరం, ఒంటిమిట్ట, భాకరాపేట, కడప, ఎర్రగుంట్ల, చిలమకూరు మీదుగా ముద్దనూరు దగ్గర ముంబైని కలిపే NH-67ను కలుస్తుంది).

అనుబంధ జాతీయ రహదారి:

NH-167B: మైదుకూరు మార్కెట్ జంక్షన్ దగ్గర NH-67 నుంచి విడిపోయి వనిపెంట, పోరుమామిళ్ళ మీదుగా సింగరాయకొండ దగ్గర NH-16ను కలుస్తుంది.

– గాలి త్రివిక్రమ్

ఇదీ చదవండి!

అగస్తేశ్వరాలయాలు

అగస్తేశ్వరాలయాలు – కడప జిల్లా

కడప జిల్లాలో ఉన్న అరుదైన ఆలయాలు ఈ అగస్త్యేశ్వరాలయాలు. సరైన ప్రచారానికి నోచుకోకుండా, జనబాహుళ్యంలో ఈ అరుదైన ఆలయాల గురించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: