పదోతరగతి ఫలితాల్లో
image source: indianexpress.com

ముఖ్యమంత్రి గారూ, అభినందించండి సార్!

కడప జిల్లా గురించి ఎవరూ ఏమీ అడక్కపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత రెండేళ్ళుగా చెప్తూనే వస్తున్నారు. ఆయన ఎప్పుడైనా అలసిపోయి ఊరుకుంటే ఆయన ఏరి కోరి నియమించుకున్న కలెక్టరు కె వెంకటరమణ గారు కడప జిల్లా అంటే “భయం… భయం…” అని అందరికీ నూరిపోస్తూనే ఉన్నారు (కాకతాళీయంగా పదో తరగతి ఫలితాలు విడుదలైన రోజే ఈ జిల్లా కలెక్టరుగా ఆయనకు చివరిరోజు).

వీళ్ళ దృష్టిలో ‘రాష్ట్రంలో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా…మొదటి నిందితులు కడప జిల్లావాళ్ళే. కడప అంటే రౌడీయిజం, కడప అంటే గూండాగిరి. కడప అంటే నేరస్థుల అడ్డా’. అలాంటి భయానక వాతావరణంలో పెరిగే పిల్లలేమౌతారు? నేరాలలో ఆరితేరి అసాంఘిక శక్తులౌతారు. కానీ కడప జిల్లా పిల్లలు మాత్రం ప్రత్యేకించి బాబుగారికి కడప ఫోబియా మొదలయ్యాక వరుసగా రెండోసారీ పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు.

చదవండి :  పట్టిసీమ డెల్టా అవసరాల కోసమే : నిజం చెప్పిన చంద్రబాబు

కడప జిల్లాను నిందించడానికి ఎప్పుడూ ముందుండే ముఖ్యమంత్రి గారు అంతటి ప్రతికూల వాతావరణం మధ్య చదువు మీద దృష్టి నిలిపి అపూర్వ విజయం సొంతం చేసుకున్న కడప పిలకాయలను అభినందించి తీరాలి. అన్నట్లు బాబుగోరికి కడప ఫోబియా పట్టుకున్నప్పటి నుంచి గత రెండేళ్ళలోనూ పదవ తరగతి ఫలితాల్లో కడప జిల్లాయే ప్రథమస్థానంలో నిలవడం, అది చాలనట్లు ఇప్పుడు వారి సొంతజిల్లా అట్టడుగుకు దిగజారడం చిత్రంగా ఉంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014లో చిత్తూరు జిల్లానే రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది.

చదవండి :  రాయలసీమది ఫ్యాక్షన్ సంస్కృతా?

ఈ విజయం గాలిపాటున వచ్చి పడింది కాదు. దీని వెనుక పక్కా ప్రణాళికతో కూడిన కఠోరశ్రమ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడుతున్న విద్యార్థులను గుర్తించి, జిల్లా విద్యాధికారి ప్రతాప్ రెడ్డి గారి నిర్దేశకత్వంలో మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు ఆయా విద్యార్థుల ఇళ్ళకు వెళ్ళి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, ఆ పిల్లలు ధైర్యం కోల్పోకుండా, పరీక్షల సమయంలో వాళ్ళ ఏకాగ్రత చెదరకుండా ఉండేలా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోబట్టి ఇది సాధ్యమైంది. దీంట్లో భాగస్వాములైనవాళ్ళందరికీ విజయాభినందనలు!

చదవండి :  చౌదరి సార్ ఇకలేరు

నిరుడు పదవ తరగతి ఫలితాల్లో కడప జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో రావడం జీర్ణించుకోలేకపోయిన ఒకానొక అగ్రశ్రేణి తెలుగు దినపత్రిక ‘కడప జిల్లా ప్రథమస్థానంలో రావడమా? అదెలా కుదురుతుంది?’ అన్న ధోరణిలో సందేహాలు వెలిబుచ్చి, ఎప్పుడో ఎక్కడో బీహార్లో కాపీయింగ్ జరుగుతున్న ఫోటో చూపించి (ఈ ఫోటో చాలా ప్రసిద్ధం) కడప జిల్లాలో చూచిరాతలు (copying) ఆ స్థాయిలో జరగడం వల్లే అది సాధ్యమైందని తీర్మానించింది.  ఆ అగ్రశ్రేణి పత్రిక ఈసారి ఏ వక్రభాష్యాలు చెప్తుందో చూడాలి.

– త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

ఇదీ చదవండి!

మిడిమేలపు మీడియా

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: